ధరణిలో తప్పిదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-11-30T00:17:05+05:30 IST

ధరణి పోర్టల్‌లో తనకు దక్కాల్సిన భూమి ఇతరులు ఫౌతి చేసుకోవడంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన తూప్రాన్‌ పట్టణ పరిధి హైదర్‌గూడలో మంగళవారం చోటు చేసుకుంది.

ధరణిలో తప్పిదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం
శంకర్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

తూప్రాన్‌, నవంబరు 29: ధరణి పోర్టల్‌లో తనకు దక్కాల్సిన భూమి ఇతరులు ఫౌతి చేసుకోవడంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన తూప్రాన్‌ పట్టణ పరిధి హైదర్‌గూడలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్‌ పట్టణ పరిధిలోని హైదర్‌గూడకు చెందిన పిట్ల శంకర్‌(30)కు వారసత్వంగా వచ్చిన భూమిని, ధరణి పోర్టల్‌లో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని పిట్ల కిష్టయ్య అనే వ్యక్తి అక్రమంగా ఫౌతీ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఏడాది నుంచి పిట్ల శంకర్‌ పలుమార్లు అధికారులను సంప్రదించాడు. పెద్దల సమక్షంలోనూ పంచాయతీ నిర్వహించాడు. పోలీ్‌సస్టేషన్‌లోనూ సంప్రదించాడు. అయినా కిష్టయ్య వినకపోవడం, అధికారులు విచారణ చేయకపోవడంతో విసిగిపోయి చేతి మణికట్టు కోసుకుని ఆపై ఉరేసుకున్నాడు. గ్రామస్థులు గమనించి అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు శంకర్‌ను వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొదుతున్నాడు.

Updated Date - 2022-11-30T00:17:05+05:30 IST

Read more