అదృశ్యమైన యువకుడు చెరువులో శవమై లభ్యం

ABN , First Publish Date - 2022-10-12T04:58:35+05:30 IST

మండలంలోని అసద్‌ మహమ్మద్‌పల్లిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు.

అదృశ్యమైన యువకుడు చెరువులో శవమై లభ్యం

టేక్మాల్‌, అక్టోబరు 11: మండలంలోని అసద్‌ మహమ్మద్‌పల్లిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు. గ్రామానికి చెందిన నీలగిరి వంశీ(22) ఈ నెల 9న అదృశ్యమయ్యాడు. అతడి భార్య మల్లీశ్వరి తమ బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తన భర్త కనిపించడం లేదని సోమవారం టేక్మాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో వంశీ మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు.  

Read more