ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2022-10-14T05:54:27+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

-మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని


మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 13: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను యాక్సిడెంట్‌ జోన్స్‌గా గుర్తించి, యాక్సిడెంట్లు జరగకుండా బోర్డులను, స్టాపర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పోలీస్‌ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్‌ కేసులను తగ్గించాలన్నారు. బ్ల్యూకొల్ట్స్‌, పెట్రో మొబైల్‌ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం చాలా ముఖ్యమన్నారు. మహిళలు, పిల్లల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. పోక్స్‌ కేసులు, ఎస్టీ, ఎస్సీ కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్థులకు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. వర్టికల్స్‌లో సిబ్బంది పోటీతత్వంతో పనిచేసి మెరుగైన అభివృద్ధి సాధించాలని కోరారు. పెండింగ్‌ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్నిస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీ సైదులు, యాదగిరిరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, పాల్గొన్నారు.

Updated Date - 2022-10-14T05:54:27+05:30 IST