ఆర్టీసీ బెస్ట్‌ రీజియన్‌గా మెదక్‌

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

ఆర్టీసీ మెదక్‌ రీజియన్‌కు ఉత్తమ అవార్డు వరించింది. వంద రోజుల ఛాలెంజ్‌, ఆగస్టు ఛాలెంజ్‌లో అత్యధిక ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఆర్టీసీ బెస్ట్‌ రీజియన్‌గా మెదక్‌
అవార్డు అందుకుంటున్న ఆర్‌ఎం సుదర్శన్‌

 అవార్డు అందుకున్న ఆర్‌ఎం

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 27: ఆర్టీసీ మెదక్‌ రీజియన్‌కు ఉత్తమ అవార్డు వరించింది. వంద రోజుల ఛాలెంజ్‌, ఆగస్టు ఛాలెంజ్‌లో అత్యధిక ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో ఆదాయం, ఈపీకె(ఎర్నింగ్‌ పర్‌ కి.మీ.) లో అత్యధిక వృద్ధి సాధించిన ప్రాంతంగా మెదక్‌ రీజియన్‌ నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ చేతుల మీదుగా మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి డిపో మేనేజర్‌ సత్యనారాయణ, సిద్దిపేట డిపో మేనేజర్‌ కిషన్‌రావు, వివిధ డిపోల్లో పనిచేస్తున్న నలుగురు సూపర్‌వైజర్లు, ఒక కంట్రోలర్‌, ఏడుమంది మెకానిక్‌లు, 22 మంది కండక్టర్లు, ఒక ఆర్టీసీ కానిస్టేబుల్‌, 20 మంది డ్రైవర్లకు అవార్డులను అందజేశారు.  


Read more