మర్కుక్‌కు జూనియర్‌ కళాశాలను మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2022-10-13T04:24:17+05:30 IST

మర్కుక్‌ మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరుచేయాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగీవ్ర తీర్మానం చేశారు.

మర్కుక్‌కు జూనియర్‌ కళాశాలను మంజూరు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ పాండుగౌడ్‌

మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం

జగదేవ్‌పూర్‌, అక్టోబరు 12: మర్కుక్‌ మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరుచేయాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగీవ్ర తీర్మానం చేశారు. బుధవారం మర్కుక్‌లోని ఎస్సీ ఫంక్షన్‌హాల్‌లో ఎంపీపీ పాండుగౌడ్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరుచేయాలని కోరగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలన్నారు. వివిధశాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మర్కుక్‌ వైస్‌ ఎంపీపీ మంద బాల్‌రెడ్డి మాట్లాడుతూ చేబర్తిలో మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని సంబంధిత అధికారులకు చెప్పినా ఫలితం లేకుండాపోయిందన్నారు. మండలంలోని చెరువులు కబ్జాకు గురయ్యాయని, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువుల శిఖం హద్దులను గుర్తించాలని తెలిపారు. పలు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయాలు లేక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆయాలను భర్తీ చేయాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ప్రవీణ్‌ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంగమ్మరాంచంద్రం, ఎంపీడీవో ప్రవీణ్‌, తహసీల్దార్‌ భవాని, ఎంపీటీసీలు నరేందర్‌, చైతన్య, ధనలక్ష్మి, లక్ష్మీనర్సమ్మ, సర్పంచులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-13T04:24:17+05:30 IST