రంగనాయక సాగర్‌ పరిసరాల్లో యథేచ్ఛగా వ్యర్థాలు

ABN , First Publish Date - 2022-11-27T23:01:13+05:30 IST

చిన్నకోడూరు, నవంబరు 27: ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు వెచ్చించి గ్రామాల్లో డంపింగ్‌యార్డులను నిర్మించింది.

రంగనాయక సాగర్‌ పరిసరాల్లో యథేచ్ఛగా వ్యర్థాలు

చంద్లాపూర్‌ గ్రామ శివారులో చెత్తను పడేసి కాల్చుతున్న వైనం

పట్టించుకోని అధికారులు

చిన్నకోడూరు, నవంబరు 27: ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు వెచ్చించి గ్రామాల్లో డంపింగ్‌యార్డులను నిర్మించింది. ఆయా గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు పదేపదే సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. మండలంలోని చంద్లాపూర్‌ గ్రామంలో ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను పంచాయతీ సిబ్బంది డంపింగ్‌యార్డు తరలించకుండా గ్రామ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పరిసరాల్లో పోసి కాల్చుతున్నారు. చెత్తను కాల్చడం వల్ల వెలువడే పొగ, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు, ఆ సమీప రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పరిసరాల్లో చెత్తను వేసి కాల్చుతుండటంతో ప్రాజెక్టులోని నీరు కాలుష్యానికి గురై, చేపలు మృత్యువాత పడే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మల్లేశంను వివరణ కోరగా గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నామని, ప్రాజెక్టు సమీపంలోని ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సిబ్బంది అక్కడ పోసినట్లు ఉన్నారని, మరోమారు చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-11-27T23:01:14+05:30 IST