గ్రామాలను నందనవనంగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-11-23T23:58:05+05:30 IST

గ్రామాలను నందనవనంగా తీర్చిదిద్దుతామని, సీఎం కేసీఆర్‌ పల్లెల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

గ్రామాలను నందనవనంగా తీర్చిదిద్దుతాం
మల్లుపల్లిలో గౌడసంఘం కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

ప్రతీ పంచాయతీకి రూ.10 లక్షల ప్రత్యేక నిధులను కేటాయిస్తానన్న సీఎం కేసీఆర్‌

పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపడతాం

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక/మిరుదొడ్డి, నవంబరు 23 : గ్రామాలను నందనవనంగా తీర్చిదిద్దుతామని, సీఎం కేసీఆర్‌ పల్లెల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మిరుదొడ్డి మండలం చెప్యాల, మల్లుపల్లి, మిరుదొడ్డి, కాసులాబాద్‌, లక్ష్మీనగర్‌, ఆరేపల్లి గ్రామాల్లో గౌడ కమ్యూనిటీహాల్‌, అంబేడ్కర్‌ సంఘం కమ్యూనిటీ భవనం, అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమి పూజను చేశారు. దుబ్బాకలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపడతాన్నారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రూ.10 లక్షల ప్రత్యేక నిధులను కేటాయిస్తానని హామీనిచ్చారని కొత్త ప్రభాకర్‌రెడ్డి గుర్తుచేశారు. జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పంటలకు సాగునీరును అందించడానికి కాల్వల నిర్మాణం చేపట్టామన్నారు. పెండింగ్‌లో ఉన్న కాల్వ పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. విద్యుత్తు తీగల లూప్‌లైన్లను సరిచేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తివంచనలేకుండా కృషిచేస్తానని వెల్లడించారు. కాసులాబాద్‌, ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎర్త్‌ ఫౌండేషన్‌ దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి, యూనిఫామ్‌లనును అందజేశారు. కౌన్సిలర్‌ నిమ్మ రజిత ఆధ్వర్యంలో మొదటి వార్డు నుంచి పలువురు బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితా, దుబ్బాక, మిరుదొడ్డి ఎంపీపీలు పుష్పలత, సాయిలు, జడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, లక్ష్మీలింగం, ఆత్మకమిటీ చైర్మన్‌ భాస్కరచారి, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంటకయ్య సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మిరుదొడ్డి మండలం చెప్యాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంపై తనకు సమాచారం ఇవ్వలేదని గ్రామ సర్పంచు లక్ష్మీ బీజేపీ మండల అధ్యక్షుడు దేవరాజుతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-23T23:58:05+05:30 IST

Read more