అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

ABN , First Publish Date - 2022-12-12T00:12:27+05:30 IST

అంబేడ్కర్‌ స్ఫూర్తిని నింపుకుని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం
నాటకాన్ని ప్రదర్శిస్తున్న గాంధీ, అంబేడ్కర్‌, ఇతర పాత్రదారులు

సిద్దిపేట కల్చరల్‌, డిసెంబరు 11 : అంబేడ్కర్‌ స్ఫూర్తిని నింపుకుని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డులో అంబేడ్కర్‌ జీవిత చరిత్ర నృత్య ప్రదర్శనను తిలకించి ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ మళ్లీజన్మించాడా అన్న విధంగా అంబేడ్కర్‌ ఆత్మను కళాకారులు ఆవిష్కరించాడని చెప్పారు. అంబేడ్కర్‌ ఎన్ని కష్టాలు ఎదురైనా చదివే ధ్యేయంగా చదువు ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆలోచించారని చెప్పారు. ఉన్నత చదువులు చదివి అతి గొప్పనైన భారత రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు ఒకవైపు తన కుమారుడు ఆరోగ్యం బాగా లేనప్పటికీ తన భర్త ఆశయ సాధన కోసం పేద వర్గాల అభ్యున్నతి కోసం రమాబాయి చేసిన త్యాగం చాలా గొప్పదని చెప్పారు. రమాబాయి త్యాగం చూస్తున్నప్పుడు తాను కంటతడి పెట్టానని చెప్పారు. మతాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్న శక్తులతో అప్రమత్తంగా ఉండాలని నాట్యం ద్వారా నిరూపించారని చెప్పారు. ఈకార్యక్రమాన్ని నిర్వహించిన మాధవరావు జగ్గరాజులను మంత్రి శాలువాతో సన్మానించారు.

Updated Date - 2022-12-12T00:12:27+05:30 IST

Read more