ఐక్యతతో సాధిద్దాం

ABN , First Publish Date - 2022-11-24T00:02:14+05:30 IST

పార్టీలకతీతంగా ఐక్యంగా ఉండి హుస్నాబాద్‌లో సబ్‌కోర్టును సాధించుకుందామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

ఐక్యతతో సాధిద్దాం

హుస్నాబాద్‌ సబ్‌కోర్టు ఏర్పాటే అందరి ఎజెండా... కలిసి ప్రయత్నం చేద్దాం

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్‌/ హుస్నాబాద్‌ టౌన్‌, నవంబరు 23 : పార్టీలకతీతంగా ఐక్యంగా ఉండి హుస్నాబాద్‌లో సబ్‌కోర్టును సాధించుకుందామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని మూడు రోజులుగా హుస్నాబాద్‌ పట్టణంలోని మున్సి్‌పకోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు బుధవారం అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ఇది అందరి ఎజెండాగా కలిసి ప్రయత్నం చేద్దామన్నారు. ఈ ప్రాంతం సీఎం కేసీఆర్‌కు సహకరించిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రాంతమని వారు దీనికి సానుకూలంగానే ఉంటారన్నారు. మంత్రి హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిని త్వరలో కలుస్తామన్నారు. ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ సీఎం కేసీఆర్‌ అపాయిట్‌మెంట్‌ తీసుకుంటే తాము కలిసి వస్తామన్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ విషయంపై సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, స్ఫూర్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు పందిల్ల శంకర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్‌ కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సాయిని మల్లేశం, ఒగ్గోజు సదానందం, టీఆర్‌ఎస్‌, సీపీఐ, కాంగ్రెస్‌, వైఎ్‌సఆర్‌టీపీ, టీడీపీ, బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ హఠావో.. దేశ్‌ బచావో నినాదంతో..

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు బీజేపీ హఠావో..దేశ్‌ బచావో నినాదంతో ముందుకు వెళ్తున్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామం ప్రమాదంలో ఉన్నందున దేశవ్యాప్తంగా లౌకిక వామపక్ష విశాల వేదిక నిర్మించాలని సీపీఐ జాతీయ మహాసభల్లో నిర్ణయించారన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, నాయకులు గడిపె మల్లేశ్‌, జాగీరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:02:15+05:30 IST