లక్ష్మణ్‌ బాపూజీ ఆశయసాధనకు పాటుపడాలి

ABN , First Publish Date - 2022-09-28T04:58:17+05:30 IST

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయసాధనకు పాటుపడాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయసాధనకు పాటుపడాలి
చేర్యాలలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

చేర్యాల, సెప్టెంబరు 27: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయసాధనకు పాటుపడాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 107వ జయంతిలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనకోసం లక్ష్మణ్‌ బాపూజీ చేసిన కృషి అనిర్వచనీయమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, పద్మశాలి సమాజం నాయకులు పాల్గొన్నారు.

గజ్వేల్‌: నిరంతర పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని కొండా లక్ష్మణ్‌ 107వ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారితో మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, కౌన్సిలర్లు రజిత, భాగ్యలక్ష్మి, చందు, మాజీ ఆప్కో డైరెక్టర్‌ టి.రాజు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో వైస్‌ చైర్మన్‌ జకీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మణ్‌ బాపూజీ జయంతి నిర్వహించారు. 

సిద్దిపేట రూరల్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు డాక్టర్‌ సతీష్‌, బూర మల్లేశం, ప్రభాకర్‌, ముదిగొండ శ్రీనివాస్‌, స్వామి పాల్గొన్నారు. 

సిద్దిపేట క్రైం: కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి సందర్భంగా సిద్దిపేట కేంద్రంలోని సుడా పార్కు వద్ద  ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పత్రి శ్రీనివా్‌సయాదవ్‌, కోడూరి నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు రవి, పంచాయతీ కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

తొగుట: తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తొగుట మాజీ ఎంపీటీసీ సుతారి రమేష్‌, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపిల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఎస్పీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని నిర్వహించారు.  

కోహెడ: కోహెడ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కొక్కుల కీర్తి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవేందర్‌రావు, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య పాల్గొన్నారు.

Read more