లారీ ఢీకొని కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-02-17T05:03:52+05:30 IST

లారీ ఢీకొని కార్మికుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్లమాచనూర్‌ గ్రామశివారులో సంగారెడ్డి-నర్సాపూర్‌ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగింది.

లారీ ఢీకొని కార్మికుడి మృతి

 హత్నూర, ఫిబ్రవరి 16: లారీ ఢీకొని కార్మికుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్లమాచనూర్‌ గ్రామశివారులో సంగారెడ్డి-నర్సాపూర్‌ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగింది. గుండ్లమాచనూర్‌ గ్రామానికి చెందిన చినింగి అనిల్‌(28) గ్రామ శివారులోని అరబిందో ఫార్మా యూనిట్‌-9 పరిశ్రమలో పదేళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. రోజువారి మాదిరిగానే బుధవారం ఉద యం పరిశ్రమలో పని కోసం బైక్‌పై బయల్దేరాడు. పరిశ్రమ సమీపంలో దౌల్తాబాద్‌ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈక్రమంలో కార్మికుడు అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు చికిత్స నిమిత్తం సంగారెడ్డి సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. మృతుడికి భార్య మమత, తల్లి శాంతమ్మ ఉన్నారు.


 

Read more