లారీ ఢీకొని మహిళ దుర్మరణం

ABN , First Publish Date - 2022-02-20T04:13:36+05:30 IST

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది.

లారీ ఢీకొని మహిళ దుర్మరణం

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 19: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన మెదక్‌ పట్టణంలో శనివారం మధ్యాహ్నం  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండల పరిధిలోని కుకునూర్‌ గ్రామానికి చెందిన మంద పద్మ(48) భర్త మోహన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హవేళీఘణపూర్‌లో శుభకార్యానికి బయలుదేరారు. మెదక్‌లోని పాత సాయిదీప్‌ దుకాణం వద్ద ఉన్న శ్మశానవాటి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడిన పద్మ  తలపై నుంచి లారీ  దూసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. భర్త మోహన్‌కు గాయాలయ్యాయి. భర్త మోహన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more