రీజనల్‌ రింగురోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి భూమి ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-09T05:21:49+05:30 IST

రీజనల్‌ రింగురోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంగా భూమి ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. రీజనల్‌ రింగు రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న సంగారెడ్డి నియోజకవర్గంలోని రైతులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు.

రీజనల్‌ రింగురోడ్డు ఏర్పాటులో  భూములు కోల్పోతున్న వారికి భూమి ఇవ్వాలి
కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కలెక్టర్‌ను కోరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


 ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి, సెప్టెంబరు 8: రీజనల్‌ రింగురోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంగా భూమి ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. రీజనల్‌ రింగు రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న సంగారెడ్డి నియోజకవర్గంలోని రైతులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ రీజనల్‌ రింగురోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరూ పేదవారన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంగా భూమి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు. రైతుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. ఇదే విషయమై ఆర్డీవోతో కూడా చర్చించామన్నారు. అలాగే సదాశివపేటలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చానన్నారు. సంగా       రెడ్డిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మహిళా హాస్టల్‌కు సొంత భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. 


పోటీపై ఊహాగానాలే..

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ ప్రసార సాఽధనాల్లో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మీ ఊహాగానాలకు తాను ఇప్పుడే సమాధానం ఇవ్వలేనని మీడియాతో అన్నారు. తాను పోటీ చేయనంటూ చేసిన ప్రసారాన్ని తప్పుపట్టనని, అలాగని సమర్థించబోనని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులకు సూచించారు.Read more