కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకం

ABN , First Publish Date - 2022-09-17T05:53:52+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకం


చేర్యాల, సెప్టెంబరు16 : కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా గీస భిక్షపతి, మారుపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, నర్ర రఘువీరారెడ్డి, చెట్కూరి తిరుపతి, శనిగరం లక్ష్మినారాయణ, జాటోతు స్వప్న, ఎర్ర గొల్ల మల్లేశ, కందుకూరి సిద్ధిలింగం, బోయిన సాయికుమార్‌, బుడిగె రమేశ్‌, గడ్డం మహేశ్‌యాదవ్‌, పచ్చిమడ్ల సిద్ధిరాములు, ,నామిరెడ్డి సౌజన్య, సూటిపల్లి బుచ్చిరెడ్డితో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ నియామకమయ్యారు. సభ్యులంతా కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుత కమిటీలో మంత్రి హరీశ్‌రావు సన్నిహితుడు మారుపల్లి శ్రీనివా్‌సకు చోటు కల్పించగా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విధేయుడు తాజా మాజీ చైర్మన్‌ గీస భిక్షపతికి మరోమారు అవకాశం దక్కింది. దీంతో చైర్మన్‌ ఎన్నిక విషయమై ఆసక్తికరంగా మారినా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గీస భిక్షపతికే అవకాశం ఇవ్వనున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతుంది. 


Read more