పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-12T04:23:27+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత సూచించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత 

హుస్నాబాద్‌, సెప్టెంబరు 11: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత సూచించారు. ఆదివారం 10 గంటలకు పది నిమిషాల్లో భాగంగా 15వ వార్డులో బ్లీచింగ్‌ పౌడర్‌, దోమల నివారణ మందు, ఆయిల్‌ బాల్స్‌ స్ర్పే చేయించారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు వీలవుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌ పాల్గొన్నారు. 

Read more