‘జేఎన్టీయూ అక్రమాలపై విచారణ జరపాలి’

ABN , First Publish Date - 2022-03-05T04:37:13+05:30 IST

సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో శుక్రవారం జేఎన్టీయూ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు.

‘జేఎన్టీయూ అక్రమాలపై విచారణ జరపాలి’
పుల్‌కల్‌, మార్చి 4: సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో శుక్రవారం జేఎన్టీయూ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. వసతి గృహాల్లో అకారణంగా విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచి భారం వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల మహేశ్‌, జిల్లా కమిటీ సభ్యులు రవి, అనిల్‌, నాని, రాజు, ప్రశాంత్‌, యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more