త్రయంబకేశ్వర్‌లో ‘జపయజ్ఞ పరిసమాప్తి’

ABN , First Publish Date - 2022-12-02T00:16:52+05:30 IST

మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర్‌లో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ జపయజ్ఞ పరిసమాప్తి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్వామిజీ ఆదేశానుసారం మూడేళ్ల క్రితం శ్రీ దత్తాయనమః అనే మూలమంత్రం జపాన్ని ప్రారంభించిన భక్తులు వేయికోట్ల మార్లు పూర్తి చేశారు.

త్రయంబకేశ్వర్‌లో ‘జపయజ్ఞ పరిసమాప్తి’
దత్తాత్రేయ జపయజ్ఞంలో పాల్గొన్న మాధవానంద సరస్వతీస్వామి

జోగిపేట, డిసెంబరు 1: మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర్‌లో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో దత్తాత్రేయ జపయజ్ఞ పరిసమాప్తి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్వామిజీ ఆదేశానుసారం మూడేళ్ల క్రితం శ్రీ దత్తాయనమః అనే మూలమంత్రం జపాన్ని ప్రారంభించిన భక్తులు వేయికోట్ల మార్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా త్రయంబకేశ్వర్‌ క్షేత్రంలో గత నెల 26న ప్రారంభించిన జపయజ్ఞ పరిసమాప్తి కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నది. 5 రోజులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన సుమారు 3 వేలకు పైగా స్వామి శిష్యులు త్రయంబకేశ్వర్‌ క్షేత్రంలోనే బస చేసి యజ్ఞంలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ప్రతినిత్యం సుమారు వేయి మందికిపైగా భక్తులు త్రయంబకేశ్వర్‌కు వెళ్ళి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్వామి మాధవానంద సరస్వతీ గురువారం అనుగ్రహ భాషణం చేస్తూ... సకల మానవాళిని రక్షించేది దైవ నామమొక్కటేనని, అందుకే సనాతన ధర్మాన్ని ఆచరించేవారు దైవనామస్మరణ చేయాలన్నారు. తద్వారా మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని పొందగలుగుతారన్నారు. ఉత్తరాధికారి మధుసూదనానంద సరస్వతీ స్వామితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన బ్రాహ్మణ సంఘాల బాధ్యులు, శిష్యులు కార్యక్రమం ముగిసేవరకు అక్కడే ఉండి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షింస్తారని తెలిపారు.

Updated Date - 2022-12-02T00:16:54+05:30 IST