హుస్నాబాద్‌ అభివృద్ధిపై చర్చకు ఎమ్మెల్యే సిద్ధమా?

ABN , First Publish Date - 2022-09-29T05:25:15+05:30 IST

హుస్నాబాద్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా ? మీరు ఎప్పుడూ చర్చకు పిలిచినా రావడానికి మేము సిద్ధం.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శ చేసే ముందు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని హౌజ్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌, బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ను డిమాండ్‌ చేశారు.

హుస్నాబాద్‌ అభివృద్ధిపై చర్చకు ఎమ్మెల్యే సిద్ధమా?
సమావేశంలో మాట్లాడుతున్న బొమ్మ శ్రీరాంచక్రవర్తి

ఈటలపై విమర్శ చేసేముందు నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం

హౌజ్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌, బీజేపీ నేత బొమ్మ శ్రీరాంచక్రవర్తి


హుస్నాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 28: హుస్నాబాద్‌  అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా ? మీరు ఎప్పుడూ చర్చకు పిలిచినా రావడానికి మేము సిద్ధం.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శ చేసే ముందు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని  హౌజ్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌, బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ను డిమాండ్‌ చేశారు. బుధవారం హుస్నాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎక్కడో కాదు మీరు అభివృద్ధి చేయలేదనడానికి హుస్నాబాద్‌ పట్టణంలోని రహదారులే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. దుమ్ముతో రోజూ పట్టణ ప్రజలు నరకాన్ని అనుభవిస్తూ.. మూతులకు బట్టలు చుట్టుకుంటున్నారన్నారు. అటు సిద్దిపేట, ఇటు హుజురాబాద్‌లో ఎలా అభివృద్ధి జరిగిందో చూడాలని, హుస్నాబాద్‌లో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సంక్షేమ గురుకులం విద్యార్థి డెంగీతో చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు.  కొత్త మండలాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం చేయాల్సింది పోయి అశాస్ర్తీయంగా రేగొండ, గోవర్ధనగిరి గ్రామాలను అక్కన్నపేట మండలంలో కలిపారని, ఆ గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చాల్సింది మీరు కాదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఆ గ్రామాల ప్రజలు తమ గ్రామాలను హుస్నాబాద్‌లో కలపాలని ఆందోళన చేస్తే హామీ ఇచ్చిన మీరు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఎల్లమ్మ చెరువు ట్యాంకుబండ్‌ పనులు నాలుగేళ్లైనా ముందుకు కదలడం లేదని వాపోయారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్య తీర్చాల్సిన మీరు అకారణంగా లాఠిచార్జీ జరిపించి భయబ్రాంతులకు గురిచేసింది మీరు కాదా? అంటూ శ్రీరాంచక్రవర్తి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకుడు నాగిరెడ్డి విజయపాల్‌రెడ్డి, నేషనల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు మెంబర్‌ లక్కిరెడ్డి తిరుమల,  బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు, పార్టీ మండలాధ్యక్షుడు చెక్కబండి విద్యాసాగర్‌రెడ్డి, కోమటి సత్యనారాయణ, కౌన్సిలర్‌ దొడ్డి శ్రీనివాస్‌, వేణుయాదవ్‌, కందుకూరి సతీష్‌, అరుణ్‌రెడ్డి, తోట సమ్మయ్య, భీమేశ్వర్‌, జైపాల్‌రెడ్డి, వీరాచారి తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-09-29T05:25:15+05:30 IST