ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

ABN , First Publish Date - 2022-09-14T04:47:35+05:30 IST

నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వేచ్ఛ అందించిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌
సిద్దిపేటలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలవేస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి

పలు మండలాల్లో వల్లభాయ్‌ పటేల్‌కు నివాళులు

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 13: నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వేచ్ఛ అందించిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పార్టీ పిలుపుమేరకు 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్‌ పోలో పేరిట హైదరాబాద్‌ సంస్థానాన్ని ముట్టడించిన రోజును పురస్కరించుకుని మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రజాకార్లు తెలంగాణ ప్రజలు హిందువులపై, మహిళలపై దాడులు చేసి రక్తపాతం సృష్టిస్తే, వారికి ఎదురొడ్డి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆనాడు తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం కల్పించేందుకు పోలీస్‌ యాక్షన్‌ ప్రకటించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పత్రి శ్రీనివా్‌సయాదవ్‌, ఉడత మల్లేశం, కోడూరు నరేష్‌, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

కోహెడ: నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంత విముక్తికై సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో సెప్టెంబరు 13న నిర్వహించిన ఆపరేషన్‌ పోలో (పోలీస్‌ చర్య) పురస్కరించుకుని మండల కేంద్రంలో పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

హుస్నాబాద్‌: నిజాం నవాబు పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించిన ఉక్కు మనిషి వల్లభాయ్‌ పటేల్‌ అని బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరాంచక్రవర్తి అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యుడు లక్కిరెడ్డి తిరుమల, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్‌రెడ్డి, బత్తుల శంకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.   

తొగుట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడు విభీషణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రమైన తొగుటలో నిజాం సంస్థానంపై పోలీసు బలగాలను (ఆపరేషన్‌ పోలో) సెప్టెంబరు 13న ప్రారంభించిన రోజును పురస్కరించుకుని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు నంట స్వామిరెడ్డి, నరే్‌షగౌడ్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు కళ్యాణ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-14T04:47:35+05:30 IST