చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-20T05:01:46+05:30 IST

: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, చిట్కుల్‌ సర్పంచ్‌నీలం మధు ముదిరాజ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

















పటాన్‌చెరు రూరల్‌, సెప్టెంబరు 19: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, చిట్కుల్‌ సర్పంచ్‌నీలం మధు ముదిరాజ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఈనెల 26న మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, హన్మంతరావు, రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బండ ప్రకాష్‌, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, రాష్ట రజక సంఘం యూత్‌ అధ్యక్షుడు నల్లతీగల రాజు, రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదవూర బ్రహ్మయ్య, కార్యదర్శి చిట్కుల్‌ వెంకటేష్‌, సురేశ్‌, రాష్ట్ర రజక సంఘం నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లో మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్‌ ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్రంలోనే అతి పెద్దదైన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ప్రముఖులంతా వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని మధు విలేకరులకు తెలిపారు. 

Updated Date - 2022-09-20T05:01:46+05:30 IST