జాతీయ స్థాయి సమ్మేళనానికి ఎర్రవల్లి సర్పంచ్‌కు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-20T04:36:46+05:30 IST

అభివృద్ధిపథంలో అగ్రగామిగా ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామానికి మరో అరుదైన గౌరవం దక్కింది.

జాతీయ స్థాయి సమ్మేళనానికి ఎర్రవల్లి సర్పంచ్‌కు ఆహ్వానం

సీఎం దత్తత గ్రామానికి  మరో అరుదైన గౌరవం


 జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు19: అభివృద్ధిపథంలో అగ్రగామిగా ఉన్న సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 22 నుంచి 24 వరకు మహారాష్ట్రలోని పూణేలో జాతీయ స్థాయిలో జరగనున్న పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి ఎర్రవల్లి సర్పంచ్‌ మొండి భాగ్యలక్ష్మికి ఆహ్వానం అందింది. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి వర్క్‌షా్‌పలో సర్పంచ్‌ పాల్గొననున్నారు. ఈ సమ్మేళనానికి రాష్ట్రం నుంచి ఐదు పంచాయతీలు ఎంపిక కాగా అందులో ఎర్రవల్లి ఒకటి. జాతీయస్థాయి సమ్మేళనానికి పిలుపురావడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్‌ పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు, సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

Updated Date - 2022-09-20T04:36:46+05:30 IST