ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-10T05:56:27+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంగారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వర్‌రావు ప్రకటనలో తెలిపారు.

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 9 : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సంగారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వర్‌రావు ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఈ నెల 17 వరకు వెబ్‌ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రెండో ఫేజ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read more