మొక్కల సంరక్షణలో..ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2022-06-08T04:58:52+05:30 IST

హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణలో ఇంత నిర్లక్ష్యమా..పరిసరాల పరిరక్షణ మీ బాధ్యత కాదా? అంటూ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మున్సిపల్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మొక్కల సంరక్షణలో..ఇంత నిర్లక్ష్యమా?
రామాయంపేటలో మొక్కను పరిశీలిస్తున్న ప్రతిమాసింగ్‌

మున్సిపల్‌ తీరుపై ప్రతిమాసింగ్‌ అసంతృప్తి 

రామాయంపేట, జూన్‌ 7: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణలో ఇంత నిర్లక్ష్యమా..పరిసరాల పరిరక్షణ మీ బాధ్యత కాదా? అంటూ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మున్సిపల్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సీజన్‌లో రామాయంపేట పాత హైవేకు ఇరువైపులా నాటిన మొక్కలు సరిగ్గా లేవంటూ మండిపడ్డారు. మంగళవారం ఆమె మండలంలోని తొనిగండ్లతో పాటు రామాయంపేట పట్టణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. సిద్దిపేట రహదారిలోని మల్లెచెరువు ప్రాంతాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. చెత్తా, చెదారాన్ని నివాస ప్రాంతాల్లో వేయడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటుంద న్నారు. పట్టణ, పల్లెప్రగతిలో భాగంగా పరిసరాలను చూసిన ఆమె ఇక మీదట కూడా ఇలాగే వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్నారు. ఆమె వెంట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శేఖర్‌ రెడ్డి, ఎంపీడీవో యాదగిరి రెడ్డి ఉన్నారు.


Read more