గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపూర్‌ భేష్‌

ABN , First Publish Date - 2022-11-24T23:31:23+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపూర్‌ భేష్‌ అని ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, డామాన్‌ డయ్యు రాష్ట్రాల ప్రతినిధుల బృందం కితాబునిచ్చారు.

గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపూర్‌ భేష్‌
ఇబ్రహీంపూర్‌ పాఠశాల విద్యార్థులతో ఎన్‌ఐఆర్డీ బృందం

ఎన్‌ఐఆర్డీ బృందం కితాబు

నారాయణరావుపేట, నవంబరు 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపూర్‌ భేష్‌ అని ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, డామాన్‌ డయ్యు రాష్ట్రాల ప్రతినిధుల బృందం కితాబునిచ్చారు. గురువారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌గ్రామాన్ని ఎన్‌ఐఆర్డీ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధిహామీ ద్వారా చేపట్టిన ఇంటింటికీ ఇంకుడుగుంతలు, సామూహిక గొర్రెలషెడ్లు, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, పార్క్‌, పశువులషెడ్ల అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించారు. వారివెంట ఎంపీడీవో మురళీధర్‌శర్మ, ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ కోడూరి దేవయ్య, ఎన్‌ఐఆర్డీ ప్రోగ్రాం అధికారి అనురాధ, కో ఆర్డినేటర్‌ రాజ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు హర్శత్‌, శ్రీధర్‌, రేఖారాణి, అరుణ, ఆయా రాష్ట్రాల అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:31:23+05:30 IST

Read more