సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలి

ABN , First Publish Date - 2022-10-13T04:56:40+05:30 IST

సమస్యల పరిష్కారానికి పరిశ్రమలు చేయూతనివ్వాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు.

సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలి

 ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


పటాన్‌చెరు, అక్టోబర్‌ 12: సమస్యల పరిష్కారానికి పరిశ్రమలు చేయూతనివ్వాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో జేకే ఫెన్నార్‌ పరిశ్రమ యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, అమీన్‌పూర్‌ ఎంపీపీ ఈర్ల దేవానంద్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వంగరిఅశోక్‌, ఏంఈఓ రాథోడ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీధర్‌చారి, జేకే.ఫెన్నార్‌ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.


 

Read more