సిద్దిపేట జిల్లాలో జోరు వాన

ABN , First Publish Date - 2022-09-11T05:41:41+05:30 IST

సిద్దిపేట జిల్లాలో రెండోరోజు జోరుగా వాన కురిసింది. శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం అతలాకుతలం చేసింది.

సిద్దిపేట జిల్లాలో జోరు వాన
బెజ్జంకిలో నీటమునిగిన పంట

ఎడతెరిపి లేని వానతో జనజీవనం అస్తవ్యస్తం 

సిద్దిపేట పట్టణంలో 99.5 మిల్లీమీటర్లు నమోదు


సిద్దిపేట టౌన్‌/గజ్వేల్‌/బెజ్జంకి, సెప్టెంబరు 10 : సిద్దిపేట జిల్లాలో రెండోరోజు జోరుగా వాన కురిసింది. శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై జల్లులు పడగా, మధ్యహ్నం నుంచి వర్షం జోరందుకున్నది. గజ్వేల్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ పట్టణాల్లో పలు వీధులు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. జనాలు అత్యవసర పనుల నిమిత్తం మినహా బయటకు రాలేదు. బెజ్జంకిలో ప్రధాన రోడ్డు జలమయమై వాహనరాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు గ్రామాల్లో  పంటలు నీటమునిగాయి.

సిద్దిపేట జిల్లాలో నమోదైన వర్షపాతం

సిద్దిపేట పట్టణ పరిధిలో 99.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నకోడూరు మండలంలో 89.5 మిల్లీమీటర్లు దౌల్తాబాద్‌ 64.4 మి.మీ. కొమురవెల్లి 38.5మి.మీ., తోగుట 37.5 మి.మీ., మిరుదొడ్డి 30.5 మి.మీ., చేర్యాల 29.8 మి.మీ., మద్దూర్‌ 26.8 మి.మీ., కొండపాక 26.2 మి.మీ., ములుగు 10.0మి.మీ.ల వర్షపాతం నమోదైంది. 



Updated Date - 2022-09-11T05:41:41+05:30 IST