హరితహారం సత్వరమే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:38:58+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభంకావడంతో హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన హరితహారం, గ్రామీణ క్రీడాప్రాంగణాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హరితహారం సత్వరమే ప్రారంభించాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ 


సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 6: వానాకాలం సీజన్‌ ప్రారంభంకావడంతో హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన హరితహారం, గ్రామీణ క్రీడాప్రాంగణాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 30 లోపు జిల్లాలో 40 లక్షల మొక్కలను నాటాలని ఆదేశించారు. ఈ నెల 20 లోపు జిల్లాలోని ప్రతీ ఇంటికి 6 మొక్కలను అందజేయాలని సూచించారు. ఇందులో పండ్లు, పూలు, తులసి మొక్కలు ఉండాలని నిర్దేశించారు. ప్రతీ మొక్కకు జియోట్యాగింగ్‌ ఏర్పాటు చేయాలి ఆయన పేర్కొన్నారు. గ్రామాలవారీగా మొక్కల పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. గ్రామాల్లో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపునకు సంబంధిత అధికారులు నేడు సమావేశాలను ఏర్పాటు చేయాలని, వారం రోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. పది రోజుల్లో వైకుంఠధామాలకు విద్యుత్‌ కనెక్షన్‌, నీటి సౌకర్యం కల్పించాలని అదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, గ్రామీణ అభివృద్ధి అధికారి గోపాల్‌రావు, జడ్పీ సీఈవో రమేష్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారి దేవికాదేవి తదితరులు పాల్గొన్నారు.


ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి 

సిద్దిపేట రూరల్‌, జులై 6:  సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాల్లో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం చింతమడక రైతువేదికలో అధికారులు, ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చింతమడక గ్రామంలో నిర్మాణం పూర్తయిన 130 ఇళ్లను పదిహేను రోజుల్లో అర్హులకు కేటాయించాలని ఆర్డీవో అనంతరెడ్డిని ఆదేశించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తిచేయాలని టీడబ్ల్యుఐడీసీ ఈఈ శ్రీనివా్‌సరెడ్డిని, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఆయనవెంట అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ జయలక్ష్మి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more