ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-05T04:45:44+05:30 IST

సంగారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్‌ శరత్‌ మంగళవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 4: సంగారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్‌ శరత్‌ మంగళవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా వేడుకలు నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ఆ పర్వదినం నుంచి ప్రతి ఒక్కరూ చేపట్టిన పనులు విజయవంతమై అందరికీ శుభాలు కలగాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ కోరారు. 

Read more