పేద విద్యార్థులకు వరం గురుకుల విద్యాలయాలు

ABN , First Publish Date - 2022-09-12T04:29:54+05:30 IST

గ్రామీణప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు వరంలా మారాయని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

పేద విద్యార్థులకు వరం గురుకుల విద్యాలయాలు

 ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


కంగ్టి, సెప్టెంబరు 11: గ్రామీణప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు వరంలా మారాయని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంగ్టిలోని ఎస్టీ బాలుర గురుకుల విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ గురుకులం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో ప్రైవేటుకు ధీటుగా ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. వివిధ అంశాలపై ఆర్ట్స్‌ టీచర్‌ దేవేందర్‌ నేతృత్వంలో విద్యార్థులు వేసిన చిత్ర కళలను ఎమ్మెల్యే తిలకించి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరామ్‌, ఎంపీపీ సంగీతవెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ లలితఆంజనేయులు, సర్పంచ్‌ నర్సమ్మ, నాయకులు గంగారాం, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని కంగ్టి, బీంరా, నాగూర్‌.కె, నాగూర్‌.బి, తుర్కవడగాం, రాంతీర్థ్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ఆసరా పెన్షన్‌లను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గంగారాం, సర్పంచ్‌ నర్సమ్మ, గోదావరి బస్వరాజ్‌, నీలమ్మ, రాజుపాటిల్‌, శర్ణప్ప, తదితరులు పాల్గొన్నారు. 


 

Read more