గట్లమల్యాలను సందర్శించిన గ్రూప్‌ వన్‌ అధికారులు

ABN , First Publish Date - 2022-11-24T23:37:33+05:30 IST

ఉపాధి హామీ పథకం అమలు విధానాన్ని పరిశీలించేందుకు గురువారం 8 రాష్ట్రాలకు చెందిన గ్రూపు వన్‌ అధికారుల బృందం మండలంలోని గట్లమల్యాల గ్రామాన్ని సందర్శించారు.

గట్లమల్యాలను సందర్శించిన గ్రూప్‌ వన్‌ అధికారులు
గట్లమల్యాలలో లబ్ధిదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న గ్రూప్‌ 1 అధికారుల బృందం

నంగునూరు, నవంబరు 24: ఉపాధి హామీ పథకం అమలు విధానాన్ని పరిశీలించేందుకు గురువారం 8 రాష్ట్రాలకు చెందిన గ్రూపు వన్‌ అధికారుల బృందం మండలంలోని గట్లమల్యాల గ్రామాన్ని సందర్శించారు. గట్లమల్యాలతో పాటు అక్కెనపల్లిలో గొర్రెల కాపరులకు ఉపాధి కల్పించేందుకు పశుసంవర్ధక శాఖలో అమలు చేస్తున్న పథకాలను గ్రూపు-1 స్థాయి అధికారుల బృందానికి మండల స్థాయి అధికారుల బృందం వివరించారు. ఈ సందర్భంగా గట్లమల్యాల, అక్కెనపల్లి పశువుల హాస్టల్‌ను పరిశీలించారు. లబ్ధిదారులతో గ్రామస్థాయి, మండల స్థాయి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? బర్రెల, గొర్రెల షెడ్లను ఎంత విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపట్టారని, ఎంత మేరకు ఖర్చు అయిందని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సామూహిక బర్రెల, గొర్రెల పంపిణీలో లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-11-24T23:37:33+05:30 IST

Read more