ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-18T05:14:46+05:30 IST

హుస్నాబాద్‌ పట్టణంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
గజ్వేల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయజెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి

హుస్నాబాద్‌, సెప్టెంబరు 17: హుస్నాబాద్‌ పట్టణంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, మార్కెట్‌ కార్యాలయంలో చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్‌ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డిల అమరుల భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. 

గజ్వేల్‌:రాష్ట్ర చరిత్రను నేటి తరానికి అందించేందుకు వజ్రోత్సవాలు దోహదపడతాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌లో ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ రాజమౌళి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఉమాశశి, సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, గడ కార్యాలయంలో ముత్యంరెడ్డి, కేజీబీవీలో ప్రత్యేకాధికారి విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు చౌరస్తాలో జెండావిష్కరణ చేశారు. 

చిన్నకోడూరు: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం చిన్నకోడూరు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్‌ ఎంపీపీ పాపయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

కొండపాక: కొండపాక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ రామేశ్వర్‌, కుకునూరుపల్లిలో సర్పంచ్‌ జయంతినరేందర్‌, దుద్దెడలో మహదేవ్‌, కొండపాకలో సర్పంచ్‌ మాధురి, మంగోల్‌ గ్రామంలో సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌, లకుడారంలో సర్పంచ్‌ కందూరి కనకవ్వ ఐలయ్య, మాత్‌పల్లిలో సర్పంచ్‌ మహిపాల్‌, ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాల్లో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. 

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు జాతీయజెండా ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  

నంగునూరు: నంగునూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ జాప అరుణాదేవి, రెవెన్యూ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌, భార్గర్‌సాగర్‌, పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట చైర్మన్‌ కోల రమే్‌షగౌడ్‌, మానవ వనరుల కార్యాలయం ఎదుట ఎంఈవో దేశీరెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్‌ మమత, రాజగోపాల్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ మైపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

చేర్యాల: చేర్యాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఆరీఫాబేగం, మునిసిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, అభయాంజనేయస్వామి ఆలయ ఆవరణలో వీహెచ్‌పీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొమురవెల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కీర్తన, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం నిర్వహించారు. 

దౌల్తాబాద్‌: దౌల్తాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బండి సుజాత, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ గంగాధరి సంధ్య, విద్యా వనరుల కేంద్రంలో ఎంఈవో నర్సవ్వ, పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి జెండావిష్కరించారు. 

ములుగు: ములుగు మండలంలోని వంటిమామిడి మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట చైర్మన్‌ మహ్మద్‌ జహంగీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. 

రాయపోల్‌: రాయపోల్‌ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ అనిత, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ సందీప్‌, వివిధ కార్యాలయాల వద్ద అధికారులు, గ్రామపంచాయతీల వద్ద సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేశారు. రామారంలో తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. గజ్వేల్‌ శ్రీరామకోటి  భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు తన కార్యాలయంలో పలు రకాల టీ పొడిని ఉపయోగించి జాతీయ సమైక్యతా చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. 

వర్గల్‌: వర్గల్‌ మండల వ్యాప్తంగా  గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద శనివారం వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 

కోహెడ: కోహెడ మండలంలో ఎంపీపీ కీర్తి, తహసీల్దార్‌ జావిద్‌, ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి, వైద్యాధికారి విజయరావు జెండాను ఎగురవేశారు. 

అక్కన్నపేట: అక్కన్నపేట తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సంజీవ్‌కుమార్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేశారు.

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఎంపీపీ మానస జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో అనిత, ఎంపీవో సత్యనారాయణ, సీడీపీవో జయమ్మ పాల్గొన్నారు. 

నారాయణరావుపేట: నారాయణరావుపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఉమారాణి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో ప్రకా్‌షగౌడ్‌ వేముల, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మురళీధర్‌శర్మ, ఎంపీవో శ్రీనివాస్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతో్‌షకుమార్‌, సర్పంచ్‌లు మాస శశి, నారాయణ పాల్గొన్నారు.

దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాకలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చైర్‌పర్సన్‌ వనిత, ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట చైర్మన్‌ కైలాస్‌, రెవెన్యూ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ సలీం, పోలీ్‌సస్టేషన్‌ ఎదుట సీఐ కృష్ణ, ఎస్‌ఐ మహేందర్‌లు, గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు బాలే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. అలాగే మిరుదొడ్డి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీపీ సాయిలు ఆవిష్కరించారు. 

జగదేవ్‌పూర్‌: జగదేవ్‌పూర్‌ మండల కార్యాలయం ఎదుట ఎంపీపీ బాలేషంగౌడ్‌, తీగుల్‌, మునిగడప, చాట్లపల్లి, వట్టిపల్లి, బస్వాపూర్‌, తిమ్మాపూర్‌, రాయవరం, చిన్నకిష్టాపూర్‌, జగదేవ్‌పూర్‌, ధర్మారం, అలిరాజ్‌పేట, ఇటిక్యాల గ్రామాల్లో  గ్రామపంచాయతీల ఎదుట సర్పంచులు, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు జెండాలను ఎగురవేశారు. 

మద్దూరు: మద్దూరు, దూళిమిట్ట మండల కేంద్రాల్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దార్లు నరేందర్‌, గోపాల్‌, ఎంపీడీవో శ్రీనివా్‌సగౌడ్‌, ఎస్‌ఐ నారాయణ, వైద్యాధికారి రాజు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి సర్పంచ్‌ బండి శ్రీనివా్‌సతో కలిసి అమరవీరుల స్తూపం, బురుజు వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. 

Read more