నిరుపేదలకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-22T05:29:10+05:30 IST

నిరుపేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు.

నిరుపేదలకు అండగా ప్రభుత్వం

 జహీరాబాద్‌, సెప్టెంబరు 21: నిరుపేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. బుదవారం మొగుడంపల్లి మండలంలోని రాయిపల్లితండా, ఖాన్‌జమాల్‌పూర్‌, మన్నాపుర్‌, ధనసిరి, మాడ్గి, గోట్టిగర్‌పల్లి, అసాద్‌గజ్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు ధ్రువపత్రాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో ప్రత్యేక నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ అరుణవిజయమోహన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ పెంటారెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు కిషన్‌పవార్‌, సర్పంచ్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు సురేష్‌, సర్పంచులు హబ్సీ రాజు, ఖేర్‌చౌహాన్‌, ఈశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ ఫరిన్‌ ఫాతిమా, షకీల్‌ అహ్మద్‌, తుకప్ప, మాజీ ఎంపీపీలు విజయ్‌కుమార్‌, చిరంజీవి, మాజీ ఎంపీటీసీ విజయరెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఓంకార్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, పరశురాం, ప్రభు, కులకర్ణి ఇజ్రాయేల్‌బాబీ, అశోక్‌రెడ్డి, గంజే నాగేష్‌, మల్లన్న, నాగిరెడ్డి, వీరన్న, శంకర్‌,  మాణిక్‌, గోవింద బక్కన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.


 

Read more