గోకార్ట్‌ ట్రాక్‌తో విద్యార్థులకు ఉపయోగం

ABN , First Publish Date - 2022-11-18T23:59:48+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో లేనివిధంగా మొట్టమొదటిసారి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో గోకార్ట్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశామని విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ కె.విష్ణురాజు పేర్కొన్నారు.

గోకార్ట్‌ ట్రాక్‌తో విద్యార్థులకు ఉపయోగం

రాష్ట్రంలోనే మొదటిసారి బీవీఆర్‌ఐటీలో ఏర్పాటు

ఇంజనీరింగ్‌ విద్యార్థులు వినియోగించుకోవచ్చు

విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ విష్ణురాజు

నర్సాపూర్‌, నవంబరు 18 : తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో లేనివిధంగా మొట్టమొదటిసారి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో గోకార్ట్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశామని విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ కె.విష్ణురాజు పేర్కొన్నారు. బీవీఆర్‌ఐటీ క్యాంపస్‌లో నిర్మించిన గోకార్ట్‌ ట్రాక్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ట్రాక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి అయినా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాబోయే కాలంలో విద్యార్థులు తయారు చేసిన గోకార్ట్‌ వాహనాలు ఈ ట్రాక్‌పై టెస్టు చేయడం ద్వారా ఉత్తమమైన వాహనాలను తయారు చేయగలరని అన్నారు. ప్రతీ సంవత్సరం సొసైటీ ఆఫ్‌ ఆటోమోటివ్‌ ఇంజనీర్స్‌ ఆఽధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి ఈ రన్‌వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఆదిత్య, వైస్‌ చైర్మన్‌ రవిచంద్రన్‌రాజగోపాల్‌, ప్రిన్సిపాల్‌ లక్ష్మీప్రసాద్‌, మెకానికల్‌ హెచ్‌వోడీ మురళికృష్ణ, మేనేజర్‌ బాపిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:59:51+05:30 IST