బాలికలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు
ABN , First Publish Date - 2022-10-12T04:32:07+05:30 IST
నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు అన్నారు.

సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు
సిద్దిపేట టౌన్, అక్టోబరు 11: నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని 24వ వార్డు మహిళా సమాఖ్య భవనం, అంగన్వాడీ 4వ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు బొమ్మలు, పండ్లు, గుడ్లు పంపిణీ చేసి మాట్లాడారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు (విద్య, పోషణ, బలవంతపు వివాహాలు, చట్టపరమైన హక్కులు, హింస) మొదలగు వాటి వంటి వివక్షతపై అవగాహన పెంచడం ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పురుషులకు సమానంగా మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శైలజ, ఏఎన్ఎం శ్రీవాణి పాల్గొన్నారు.