గంగమ్మ ఒడికి గణపయ్య

ABN , First Publish Date - 2022-09-10T05:49:08+05:30 IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహించారు. ఖేడ్‌ మున్సిపాలిటీతో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రతిమలను కమలాపూర్‌ చెరువులో నిమజ్జనం చేశారు. కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో వినాయకులను సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. కంగ్టి, తడ్కల్‌ తదితర గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయకులను నిమజ్జనానికి తరలించారు.

గంగమ్మ ఒడికి గణపయ్య
చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లిలో నిమజ్జనానికి తరలిన వినాయకులు

భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం

నారాయణఖేడ్‌/కల్హేర్‌/కంగ్టి/పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహించారు. ఖేడ్‌ మున్సిపాలిటీతో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రతిమలను కమలాపూర్‌ చెరువులో నిమజ్జనం చేశారు. కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో వినాయకులను సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. కంగ్టి, తడ్కల్‌ తదితర గ్రామాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయకులను నిమజ్జనానికి తరలించారు. నారాయణఖేడ్‌ పట్టణంలో హిందూసేన గణేష్‌ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్‌ లడ్డూ ప్రసాదాన్ని పట్టణంలోని శంకర్‌ మెడికల్స్‌ యజమాని సంతోష్‌ వరుసగా 14వసారి దక్కించుకున్నారు. నిజాంపేటలో గరీబ్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూను వేలంలో పిట్ల శ్రీనివాస్‌ రూ.81 వేలకు కైవసం చేసుకున్నారు. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకబావిలో శుక్రవారం బీఎ్‌సపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగారం ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదానంలో పెద్దఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. 


మెదక్‌ జిల్లాలో..

హవేళిఘనపూర్‌/రామాయంపేట/వెల్దుర్తి/చిన్నశంకరంపేట: హవేళిఘనపూర్‌ మండలం కూచన్‌పల్లిలో శోభాయాత్రలో ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తిలో ఖడ్గం యూత్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు  కట్టుకుంది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం, శివలింగం విగ్రహం ఆకట్టుకుంది. హనుమాన్‌ ఆలయం గణనాథుడిని శోభాయాత్రలో కోలాటంతో ప్రదర్శించారు. రామాయంపేట మండలవ్యాప్తంగా గణేష్‌ నిమజ్జనాలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలో గణేష్‌ నిమజ్జనం వైభవంగా జరిగింది. గజగట్లపల్లి, జంగరాయి, శాలిపేట, రుద్రారం తదితర గ్రామాల్లో గణేష్‌ శోభాయాత్రలకు మహిళలు మంగళహారతలు పట్టారు. యువత నృత్యాలతో సందడి చేశారు.

Read more