అభివృద్ధిలో రాష్ట్రానికే గజ్వేల్‌ దిక్సూచి: జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-09-14T04:48:34+05:30 IST

అభివృద్ధిలో రాష్ట్రానికే గజ్వేల్‌ దిక్సూచిగా నిలిచిందని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ అన్నారు.

అభివృద్ధిలో రాష్ట్రానికే గజ్వేల్‌ దిక్సూచి: జడ్పీ చైర్‌పర్సన్‌
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

గజ్వేల్‌, సెప్టెంబరు 13: అభివృద్ధిలో రాష్ట్రానికే గజ్వేల్‌ దిక్సూచిగా నిలిచిందని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎంపీపీ దాసరి అమరావతి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని, అప్పటి గజ్వేల్‌కు ఇప్పటి గజ్వేల్‌కు పొంతన కూడా లేదన్నారు. అర్హులందరికీ పింఛన్లను అందజేస్తామని, రానివారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో మచ్చేందర్‌, తహసీల్దార్‌ బాల్‌రాజు, వైస్‌ ఎంపీపీ కృష్ణాగౌడ్‌, ఏవో నాగరాజు, ఎంపీవో దయాకర్‌ పాల్గొన్నారు. 

వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో రోజాశర్మ పూజలు 

వర్గల్‌, సెప్టెంబరు 13: వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలోని విద్యా సరస్వతీ అమ్మవారిని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటకృష్ణ అమ్మవారి శేషవస్ర్తాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలుయాదవ్‌, ఎంపీపీ లతారమే్‌షగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Read more