స్వాతంత్రోద్యమకారులను స్మరించుకోవాలి: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-08-16T05:36:08+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మహానీయులు చేసిన ఉద్యమాన్ని, ఉద్యమకారులను స్మరించుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.

స్వాతంత్రోద్యమకారులను స్మరించుకోవాలి: జగ్గారెడ్డి

సంగారెడ్డి రూరల్‌/జోగిపేట, ఆగస్టు 15, దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మహానీయులు చేసిన ఉద్యమాన్ని, ఉద్యమకారులను స్మరించుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆజాదికా గౌరవ్‌ పాదయాత్ర 75 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది.  సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌ గ్రామం మీదుగా సాగిన ఈ యాత్ర పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు కులబ్‌గూర్‌ గ్రామ శివారులోని ఇర్ఫాని దర్గాలో జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అందోలు నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆధ్వర్యంలో తాలెల్మ వద్ద ప్రారంభించిన కాంగ్రెస్‌ పాదయాత్ర జోగిపేట వరకు కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం జోగిపేటలో నిర్వహించిన సభలో దామోదర  మాట్లాడుతూ.. అందోలు నియోజకవర్గం తనకు తల్లిలాంటిదని పేర్కొన్నారు. 

Read more