విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి

ABN , First Publish Date - 2022-03-05T04:34:01+05:30 IST

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని రాయిన్‌పల్లిలో శుక్రవారం జరిగింది.

విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి

మెదక్‌ రూరల్‌, మార్చి 4:  ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి మహిళ మృతి చెందిన ఘటన  మండలంలోని రాయిన్‌పల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామస్థుల వివరాల మేరకు.. రాయిన్‌పల్లి గ్రామానికి చెందిన రెడ్డి రమేష్‌ భార్య శ్యామల(35) గ్రామంలోని ఓ పొలంలో కూలీపనికి వెళ్లింది. మధ్యలో నీళ్లు తాగేందుకు బోరు పంపు వద్దకు అందరూ వెళ్లారు. ఈ క్రమంలో శ్యామల స్టార్టర్‌ బోర్డు వద్ద  స్తంభానికి గల కరెంటు తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త రమేష్‌ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు. 

Read more