యూరియా కోసం రైతుల పాట్లు

ABN , First Publish Date - 2022-08-18T05:12:36+05:30 IST

మండల కేంద్రమైన శివ్వంపేటలో వెంకటేశ్వర ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రానికి యూరియా లారీ రావడంతో ఆయా గ్రామాల నుంచి యూరియా కోసం వచ్చిన రైతులు పోటీ పడ్డారు.

యూరియా కోసం రైతుల పాట్లు
లారీ వద్ద యూరియా కోసం పోటీపడుతున్న రైతులు

శివ్వంపేట, ఆగస్టు 17: మండల కేంద్రమైన శివ్వంపేటలో వెంకటేశ్వర ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రానికి యూరియా లారీ రావడంతో ఆయా గ్రామాల నుంచి యూరియా కోసం వచ్చిన రైతులు పోటీ పడ్డారు. ఉదయం 7 గంటల నుంచే నిరీక్షిస్తున్న రైతులు లారీ రావడంతో ఒక్కసారిగా పోటీ పడటంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. రైతు సేవా కేంద్రం డీలర్‌ కిషోర్‌ వచ్చి రైతులను సముదాయించడంతో గందరగోళం సద్దుమణిగింది. రైతులు పెద్దసంఖ్యలో రాగా, కేవలం 450 సంచులే రావడంతో యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. 

Read more