రైతు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2022-08-02T05:14:09+05:30 IST

రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు.

రైతు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

ఆత్మ కమిటీ చైర్మన్‌, సభ్యుల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్‌, ఆగస్టు 1: రైతు సంక్షేమం కోసం  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. సోమవారం జహీరాబాద్‌లోని వాసవి కళ్యాణ మండపంలో ఆత్మ కమిటీ చైర్మన్‌, సభ్యుల ప్రమాణ స్వీకరణోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. రైతాంగ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభు త్వం వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ సంస్థలను పటిష్ఠం చేసి రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జహీరాబాద్‌ డివిజన్‌లో 70 వేల మందికి ప్రతీసారి రైతుబంధు పథకం అమలవుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ చైర్మన్‌ పెంటారెడ్డి, 25 మంది ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో డివిజన్‌ వ్యవసాయ సంచాలకులు భిక్షపతి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్‌ పెంటారెడ్డిని, సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. ఇదిలా ఉండగా జహీరాబాద్‌లో డివిజన్‌ వ్యవసాయ కార్యాలయ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు అగ్రికల్చర్‌ ఏడీఏ బిక్షపతి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తన్వీర్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకంత్‌పాటిల్‌ టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సయ్యద్‌ మొహీయోద్దీన్‌, నాయకులు పాల్గొన్నారు.

ఇళ్ల పంపిణీకి లాటరీ

 కోహీర్‌ మండలంలోని దిగ్వాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లను లాటరీ ద్వారా ఇండ్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు కేటాయించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమే్‌షబాబు, తహసీల్దార్‌ కిషన్‌, జడ్పీటీసీ రాందాస్‌, ఎంపీడీవో సుజాతానాయక్‌, ఎంపీవో వెంకట్‌రెడ్డి, సర్పంచు జ్యోతి, ఎంపీటీసీ బక్కారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-02T05:14:09+05:30 IST