రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-11-30T23:24:25+05:30 IST

గజ్వేల్‌, నవంబరు 30: రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

ధరణి పోర్టల్‌, ప్రజావ్యతిరేకతపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

గజ్వేల్‌, నవంబరు 30: రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు ధరణి సమస్యలు, పోడు సమస్యలు పరిష్కరించాలని, రైతుబీమా, రైతుబంధు అందరికీ అందజేయాలని డిమాండ్‌ చేస్తూ గజ్వేల్‌ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారన్నారు. ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల పాలవుతున్నాయని, గతంలో అధికారంలో ఉన్న వాళ్లంతా తమ పేర్ల మీదు భూములు రాయించుకుంటున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవడంతో గుత్తికోయల దాడిలో ఎఫ్‌ఆర్‌వో మృతిచెందాడన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుబీమా, రైతుబంధు రైతులందరికీ అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు మహేందర్‌రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాయిని యాదగిరి, గోపాల్‌రావు, సాజిద్‌బేగ్‌, నాయకులు మల్లారెడ్డి, లక్ష్మణ్‌, గుంటుకు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి మండిపడ్డారు. బుధవారం దుబ్బాకలోని పోశమ్మ ఆలయం వద్ద రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ కార్యకర్తలతో రైతు నిరసన దీక్షను చేపట్టారు.

సిద్దిపేట టౌన్‌: బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ చేస్తున్న నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలని కాంగ్రెస్‌ సిద్దిపేట నియోజవర్గ ఇన్‌చార్జి శ్రీనివా్‌సగౌడ్‌, నాయకులు అన్నారు. బుధవారం పట్టణంలోని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట ధరణి పోర్టల్‌, రైతు, ప్రజా సమస్యలపై పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2022-11-30T23:24:25+05:30 IST

Read more