చిన్న గ్రామాలైనా.. మీ మనసు పెద్దది: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-11-30T23:29:31+05:30 IST

సిద్దిపేట టౌన్‌, నవంబరు 30: చిన్న గ్రామమైన మీ మనసు పెద్దదని, మీ స్ఫూర్తి అన్ని గ్రామాలకు ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

చిన్న గ్రామాలైనా.. మీ మనసు పెద్దది: హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, నవంబరు 30: చిన్న గ్రామమైన మీ మనసు పెద్దదని, మీ స్ఫూర్తి అన్ని గ్రామాలకు ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్‌, మాటిండ్ల గ్రామ ప్రజలు లక్ష చొప్పున రూ.2 లక్షలు మంత్రికి అందజేశారు. అనంతరం డీబీఎఫ్‌ ప్రతినిధులతో కలిసి రాజ్యాంగ ప్రచారోద్యమం కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే సిద్దిపేటలోని 2వ వార్డు హనుమాన్‌నగర్‌కు చెందిన బీజేపీ యువ నాయకులు బుధవారం క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గంలోని 242 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి హరీశ్‌రావు అందజేశారు.

మంత్రిని కలిసిన ‘ఆత్మ’ కమిటీ డైరెక్టర్లు

కొండపాక, నవంబరు 30: కొండపాక మండల ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా ఎంపికైన సున్నం భాస్కర్‌, లగిశెట్టి కనకయ్య, చిరంజీవి, పాల శంకర్‌, మంతూరి రాములు, కనకయ్య, ఆరుట్ల కనకరాజు సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావును బుధవారం కలిశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కొండపాక మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్‌, ఎంపీటీసీల ఫోరం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌వైజర్లకు నియామకపత్రాలు అందజేత

రాయపోల్‌, నవంబరు 30: రాయపోల్‌ మండలం నుంచి ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలు సూపర్‌వైజర్లుగా ఎంపికైన విషయం తెలిసింది. సూపర్‌వైజర్లుగా ఎంపికైన గిరిజ, సునీతలకు బుధవారం మంత్రి హరీశ్‌రావు నియామకపత్రాలను అందజేశారు.

Updated Date - 2022-11-30T23:29:31+05:30 IST

Read more