ఐఐటీహెచ్‌లో 25 నుంచి ఎలాన్‌ ఎన్‌విజన్‌

ABN , First Publish Date - 2022-03-23T05:49:52+05:30 IST

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌ ఈ నెల 25 నుంచి 27 వరకు ఎలాన్‌ ఎన్‌విజన్‌ సాంస్కృతిక, సాంకేతిక వేడుకలు జరగనున్నాయి

ఐఐటీహెచ్‌లో 25 నుంచి ఎలాన్‌ ఎన్‌విజన్‌

రెండేళ్ల తర్వాత ఆఫ్‌లైన్‌ మోడ్‌లో సాంస్కృతిక వేడుకలు

కంది,మార్చి 22 : సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌ ఈ నెల 25 నుంచి 27 వరకు ఎలాన్‌ ఎన్‌విజన్‌ సాంస్కృతిక, సాంకేతిక వేడుకలు జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచే పాల్గొన్నారు. అయితే ఈసారి  ఆఫ్‌లైన్‌ మోడ్‌లో సాంస్కృతిక వేడుకలు కోలాహోలంగా నిర్వహించనున్నట్టు ఐఐటీహెచ్‌ అధికారులు పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు జోరా-ఎ-సుకున్‌ థీమ్‌తో మొదలు కానున్నాయి. ప్రతీసారి జరిగినట్లే ఈసారి కూడా ఐఐటీహెచ్‌ విద్యార్థులతో పాటు, రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటారు. ఈసారి కార్యక్రమాల్లో భాగంగా ప్రోక్విస్ట్‌, ఎగ్మా, ఆఫ్‌ డెవల్‌పమెంట్‌, వెబ్‌ డెవల్‌పమెంట్‌, షార్క్‌ట్యాంక్‌, సర్క్యూట్‌ బిల్డింగ్‌, కోడ్‌ ఆర్డినో, మచీనా డాక్టొరియా, డీప్‌ఎన్‌, క్యాడ్‌ ప్రో, హ్యాకథాన్‌, పేపర్‌ ప్రజంటేషన్‌, గేమ్‌ జామ్‌, బీట్‌ టిప్పర్‌, బ్రేక్‌ఫ్రీ, క్యాంపస్‌ ఐడల్‌, ఫిల్మ్‌ఫేర్‌ ఫెస్టా, గ్లిట్జ్‌ గ్లామర్‌, పెయింట్‌ ద స్ర్కీన్‌, స్టాండ్‌ అప్‌ కామెడీ, ఆర్ట్‌ ఎటాక్‌, నృత్యంజలి, డుడ్లే క్రియేషన్‌, పైస్లేటిక్‌ తదితర అంశాల్లో పోటీలుంటాయి. ఆ సంవత్సరం ఆయా పోటీల్లో విజేతలకు రూ.4 లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడించారు. 

Read more