వీఆర్‌ఏలు, రెడ్డి సంఘం నాయకుల ముందస్తు అరెస్టు

ABN , First Publish Date - 2022-09-14T05:05:09+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న క్రమంలో జహీరాబాద్‌ నియోజకవర్గంలోని వీఆర్‌ఏలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

వీఆర్‌ఏలు, రెడ్డి సంఘం నాయకుల ముందస్తు అరెస్టు

 జహీరాబాద్‌/చిన్నశంకరంపేట/సదాశివపేట, సెప్టెంబరు 13: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న క్రమంలో జహీరాబాద్‌ నియోజకవర్గంలోని చిరాగ్‌పల్లిలో ఏడుగురు వీఆర్‌ఏలను, కోహీర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఒక్కరిని, ఝరాసంగం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఎనిమిది మందిని, హద్నుర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆరుగురిని, జహీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఇద్దరిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చిన్నశంకరంపేటలో వీఆర్‌ఏలు సత్తయ్య, శంకర్‌, పోచయ్య, నర్సింహులు, నారాయణ అరెస్టయ్యారు. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన క్రమంలో.. జహీరాబాద్‌ పరిధిలో ఎనిమిది మంది రెడ్డి సంఘం నాయకులను అరెస్టు చేశారు. సదాశివపేట పట్టణంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి పాండురంగారెడ్డి, రాష్ట్ర యూత్‌ ఉపాధ్యక్షుడు పల్వట్ల విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు మనోజ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి అరెస్టయ్యారు.


 

Read more