దుబ్బాక ప్రభాకర్‌రెడ్డికే

ABN , First Publish Date - 2022-02-20T05:13:02+05:30 IST

వచ్చే ఎన్నికల్లో దుబ్బాక సీటు కొత్త ప్రభాకర్‌రెడ్డిదేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంకేతాలను ఇచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీ పాలకమండలి సభ్యులు, ఎంపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.

దుబ్బాక ప్రభాకర్‌రెడ్డికే
మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్‌ పాలక మండలి సభ్యులు

మున్సిపల్‌ కౌన్సిలర్లతో సంభాషణలో సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్‌

దుబ్బాక మున్సిపాలిటీకి రూ.జ20 కోట్లు మంజూరు

మూడు నెలల్లో మరిన్ని నిధులిస్తానని హామీ


దుబ్బాక, పిబ్రవరి 19: వచ్చే ఎన్నికల్లో దుబ్బాక సీటు కొత్త ప్రభాకర్‌రెడ్డిదేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంకేతాలను ఇచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీ పాలకమండలి సభ్యులు, ఎంపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మున్సిపాలిటీలోని సమస్యలను ఆయనకు విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి దుబ్బాక మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే క్రమంలోనే ఆయన కీలకమైన వాఖ్యలు చేశారు. దుబ్బాక అభివృద్ధి ఇకనుంచి  కొత్త ప్రభాకర్‌రెడ్డి  నేతృత్వంలోనే  జరుగుతుందని తెలిపారు. ‘ప్రభాకరన్నా మీతోనే ఉంటాడు. దుబ్బాక ప్రభాకర్‌రెడ్డిదే... కలిసి పనిచేయండి. కష్టపడి పనిచేసి దుబ్బాకను ఆదర్శంగా అభివృద్ధి చేద్దాం’ అని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో సీటు ఆయనదేనని సూచనలు ఇచ్చారు. ‘ఆయనను దుబ్బాక నుంచి వదలకండి. ఎంపీగా మిగతా నియోజకవర్గాలనూ చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కుదరదని చెప్పండంటూ కౌన్సిలర్‌లకు సూచించారు. ‘టీవీ డిబెట్లకు వెళ్లేవారితో ఒరిగేదేమీ లేదు.. ప్రస్తుత ఎమ్మెల్యేతో ఏమీకాదని’ మంత్రి వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకుడు రణం శ్రీనివా్‌సతో మాట్లాడుతూ రామలింగారెడ్డి గెలుపు కోసం ఎలా కష్టపడి పనిచేశారో.. ప్రభాకర్‌రెడ్డి కోసమూ అలాగే పనిచేయాలని సూచించారు. ప్రస్తుత నిధులకు తోడు మూడు నెలల్లో మరిన్ని నిధులను ఇస్తానని హామీఇచ్చారు. దుబ్బాక రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవానికి తాను హాజరవుతానని తెలిపారు. అలాగే, దుబ్బాక చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితారెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ సుగుణ, కౌన్సిలర్లు బంగారయ్య, యాదగిరి, ఆస స్వామి, బత్తుల స్వామి, మీనా, దేవలక్ష్మి, సంధ్య, లలిత, రజిత, బాలకృష్ణ, నాయకులు బాలకిషన్‌గౌడ్‌, పల్లె రామస్వామి, వంశీకృష్ణాగౌడ్‌, దేవుని చంద్రయ్య, ఎల్లం, సంజీవరెడ్డి, లొంక లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. 


Read more