ఫోర్జరీ సంతకాలతో పంచాయతీ నిధులు డ్రా

ABN , First Publish Date - 2022-07-19T05:12:15+05:30 IST

సిర్గాపూర్‌ మండలంలోని ఖాజాపూర్‌ గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల సంతకాలను వారి కుమారులు ఫోర్జరీ చేసి అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని సోమవారం కలెక్టర్‌కు ఆ గ్రామస్థులు, వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.

ఫోర్జరీ సంతకాలతో పంచాయతీ నిధులు డ్రా

కలెక్టర్‌కు ఖాజాపూర్‌ గ్రామస్థుల ఫిర్యాదు

కల్హేర్‌, జూలై 18:  సిర్గాపూర్‌ మండలంలోని ఖాజాపూర్‌ గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల సంతకాలను వారి కుమారులు ఫోర్జరీ చేసి  అభివృద్ధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని సోమవారం కలెక్టర్‌కు ఆ గ్రామస్థులు, వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఖాజాపూర్‌ సర్పంచ్‌ వడితే లచ్చానాయక్‌ కుమారుడు పరమేష్‌, ఉప సర్పంచ్‌ అంజవ్వ కుమారుడు పండరి ఇద్దరు కలిసి గ్రామపంచాయితీకి మంజూరైన నిధులను ఫోర్జరీ సంతకాలతో డ్రా చేస్తూ  దుర్వినియోగం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Read more