విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-25T05:14:21+05:30 IST

ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు: ఎమ్మెల్యే
గంభీర్‌పూర్‌లో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, సెప్టెంబరు 24: ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు. శనివారం దుబ్బాక మున్సిపాలిటీలోని చెల్లాపూర్‌, మండలంలోని గంభీర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే గంభీర్‌పూర్‌, దుంపలపల్లి, చెల్లాపూర్‌ వార్డుల్లో ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బాలే్‌షగౌడ్‌, భిక్షపతి, వెంకట్‌గౌడ్‌, ప్రవీణ్‌, బద్రి తదితరులున్నారు. 

Read more