అధైర్యపడొద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-07-04T05:18:20+05:30 IST

పార్టీ కోసం కృషిచేస్తున్న కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ అండగా ఉంటానని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు.

అధైర్యపడొద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి

చేర్యాల, జూలై 3: పార్టీ కోసం కృషిచేస్తున్న కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ అండగా ఉంటానని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి అన్నారు. చేర్యాలలోని ఆయన స్వగృహంలో ఆదివారం మద్దూరు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన జరిగిందే తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు జీవన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శౌకత్‌, శివయ్య, శ్రీనివా్‌సరెడ్డి, కరుణాకర్‌, శంకర్‌, సుధాకర్‌, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more