పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-06-12T04:33:30+05:30 IST

ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నర్సాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోరా?
నర్సాపూర్‌ మున్సిపల్‌కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

నర్సాపూర్‌, జూన్‌ 11: ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నర్సాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు 30శాతం పీఆర్సీ పెంచుతూ జీవో ఇచ్చినా నర్సాపూర్‌లో అమలు కావడం లేదని విమర్శించారు. ప్రతీ కార్మికుడికి ప్రస్తుత ధరలకు అనుగుణంగా రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మికులు పుష్ప, దేవయ్య, రాములు, లచ్చయ్య, శంకరయ్య, అనిత, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-12T04:33:30+05:30 IST