దివ్యాంగులు స్వయం ఉపాధితో లబ్ధిపొందాలి

ABN , First Publish Date - 2022-11-24T22:57:21+05:30 IST

నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

దివ్యాంగులు స్వయం ఉపాధితో లబ్ధిపొందాలి
దివ్యాంగులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌, నవంబరు 24: దివ్యాంగులు స్వయం ఉపాధితో లబ్ధిపొందాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోరారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ద్వారా నలుగురు దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. దివ్యాంగులు వైకల్యంతో బాధపడవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం హన్మంత్‌రావుపేట, అనంత్‌సాగర్‌కు చెందిన ఇద్దరికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును కుటుంటసభ్యులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో సీడీపీవో సుజాత, సీనియర్‌ సహాయకులు రాజు, ఖేడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రుబీనానజీబ్‌, సేవాలాల్‌ సంఘం నాయకులు రమేష్‌ చౌహాన్‌, జడ్పీటీసీ లక్ష్మిబాయిరవీందర్‌నాయక్‌, సిద్ధు, నిజాంపేట సర్పంచు జగన్‌చారి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:57:21+05:30 IST

Read more